ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది...ఇక భారీ వర్షాలు

national |  Suryaa Desk  | Published : Sun, Sep 11, 2022, 10:52 PM

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతుందని వెల్లడించింది. అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com