దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 5,221 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇక కరోనా బారిన పడిన వారిలో 5,975 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 47,176కు చేరుకుంది. కరోనా డైలీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.