విశాఖపట్నం: మాడుగుల మండలం పెద్దారెడ్డి జలాశయం ద్వారా సోమవారం ఉదయం 1445 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉదయం ఐదు గంటలకు జలాశయం నీటిమట్టం 137 మీటర్లకు గాను 136 మీటర్లు ఉండగా జలాశయం వద్ద ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై=805 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు విడుదల చేశారు ఈ మొత్తంలో 685 క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా, 60 క్యూసెక్కుల నీరు రాచకట్టు ద్వారా మరో 60 క్యూసెక్కులు నీరు ఆర్ఎంసి ద్వారా విడుదల చేశారు.
అలాగే ఉదయం 8 గంటలకు 640 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వీటిలో 520 క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా, ఆర్ఎంసి ద్వారా మరో 60 క్యూసెక్కుల నీరు, రాచకట్టు ద్వారా మరో 60 క్యూసిక్కులు నీరు విడుదల చేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి సోమవారం తెలిపారు.