అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు రోజులుగా కుండపోత వర్షాలు కురవడంతో మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత క్షీణించాయి. దీంతో పాడేరు చింతపల్లి లంబసింగి ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువైంది. మూడు రోజులుగా చలి తీవ్రత అధికమైంది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. చలి తీవ్రతతో వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.