టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై మాజీ మంత్రి కొడాలి నాని అనుచిత వాక్యలను రామకుప్పం మండల టీడీపీ నాయకులు సోమవారం ఖండించారు. కొడాలి నాని ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేబని గుర్తు చేశారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వాక్యలు చేసిన కొడాలి నానిని రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆనంద రెడ్డి, నరసింహులు, రవి, మోహన్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.