జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు సోమవారం సంచలన తీర్పును ఇచ్చింది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. హిందూ సంఘాల పిటిషన్ ను కోర్టు అనుమతించింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీదు సముదాయంలో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ హిందూ మహిళలు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.