పాఠశాల విద్యాశాఖపై ఏపీ సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లపై నిరంతరం ఆడిట్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నెలకోసారి ఆడిట్ చేయాలన్నారు. వచ్చే ఏడాది స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని, యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలని సీఎం జగన్ ఆదేశించారు.