చిత్తూరు: తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలోని బురకాయలకోట పంచాయతీ, ముత్యాలమ్మ గుడి సమీపంలో మేతకోసం పొలాల్లోకి వచ్చి రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో జింక తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ అధికార సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన జింకకు చికిత్సలు నిర్వహించేలోగా మృతి చెందినట్లు తెలిపారు. సండ్రడవిలో ఖననం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa