ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సోమవారం వరదయ్యపాలెం మండలం లోని శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. శ్రీసిటీ అమలు తీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎంపీ, పారిశ్రామిక అభివృద్ధి, పురోగతిని అభినందించారు.