ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల ఆకలిని తీర్చేది టీడీపీనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 01:23 PM

రాష్ట్రంలోని నిరుపేదల ఆకలిని తీరుస్తుంటే ఓర్చుకోలేని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తోంది. భోజనం వడ్డిస్తున్న టిడిపి నాయకులపై దాడులు, అక్రమ కేసులు పెడుతోంది. పేదల ఆకలిని తీర్చేది టిడిపి నే అని చిత్తూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త పులివర్తి నాని పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులోని ప్రైవేటు బస్సు స్టాండ్ కూడలిలో సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్న దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తే ప్రజల్లో వైఎస్సార్ సీపీకీ గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకు ప్రజల చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.


అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నదానం మహాదానమని అలాంటి అన్నదానాలను అడ్డుకుంటున్న వైసీపీ నాయకులు రాక్షసులతో సమానమని తిరుపతి రూరల్ మండల టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు లోని స్టాలిన్ గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటీన్ లను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటే. రాష్ట్రంలో పేదలకు రూ. 5 కే అన్నం పెడుతూ టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే వైసీపీ అధికారం లోకి వస్తూనే వాటిని కూల్చివేయడమే ధ్యేయంగా పెట్టుకుందన్నారు. ప్రజల గోడు వైసీపీ ప్రభుత్వానికి తగలకపోదన్నారు. ఈ కార్యక్రమంలో ఉసిరిపాటి శ్రీనివాసులు, వైకుంఠం శ్రీధర్ నాయుడు, మునిశేఖర్, చంద్రశేఖర్, వేమూరు మధు, సాయి టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com