రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం కుప్పం చెరువు కట్ట సమీపంలోని మంజునాధ్ లేఅవుట్ వద్ద హెలి ప్యాడ్ ఏర్పాటుకు, అనిమిగానిపల్లి వద్ద బహిరంగ సభ నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. బహిరంగ సభ వద్ద భ్యారి కేడింగ్ మరియు ఆర్ ఎం బి రోడ్ల మరమ్మత్తులు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లు నిమిత్తం జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఎస్, పి రిషాంత్ రెడ్డి మరియు ఎం ఎల్ సి భరత్ తో కలిసి పర్యటించి సంబంధిత అధికారులకు తగు సూచ నలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట డి ఆర్ ఓ రాజ శేఖర్, ఆర్ అండ్ బి ఎస్ ఈ దేవానందం, కుప్పం ఆర్ డి ఓ శివయ్య, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కుప్పం తహసీల్దార్ సురేష్ బాబు ఇతర సంబంధింత అధికారులు ఉన్నారు.