ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు-కడప జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుర్రంకొండ ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎన్. ఉదయ్ కుమార్ (24) సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంలో పీలేరు వైపు వస్తుండగా, ప్రొద్దుటూరు వెళుతున్న కారు పీలేరు మండలం, పొంతలచెరువు క్రాస్ వద్ద స్కూటరును ఢీకొంది. స్కూటరిస్టు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.