నాదెండ్ల మండలంలోని కనపర్రు గ్రామంలో ఈ నెల 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగిన వైయస్సార్ సీపీ ర్యాలీపై కారుతో బీభత్సవం సృష్టించిన ఘటనకు కారకులైన ముగ్గురు నిందితులను సోమవారం నాదెండ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. కనపర్రు గ్రామానికి చెందిన నాతాని ఆంజనేయులు, నాతాని సురేష్, నాతాని మనోహర్‌ల ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులను న్యాయమూర్తి రిమాండ్ విధించారు.