రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచటం ఏపీ మదర్ థెరీసా దివ్యాంగుల సేవాసమితి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో సోమవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ గతంలో వికలాంగులకు మూడు శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉంటే వీటిని 4 శాతానికి పెంచిన ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీ మదర్ థెరీసా దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ షాకీర్ హుస్సేన్, వెంకటసుబ్బయ్య, పవన్, హనుమంత్, రహమతుల్ల, మోహన్, తదితరులు పాల్గొన్నారు.