పత్తికొండ: మండల పరిధిలోగల కనకదిన్నె గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఎమ్మెల్యే శ్రీదేవి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సారధ్యంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలియజేశారు. పత్తికొండ మండల వైఎస్ఆర్సిపి నాయకులు, మండల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.