పుట్టినరోజు పేదప్రజలకు మద్దతుగా ఆకలిదీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు కేకే చౌదరి తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగుదేశంపార్టీ ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన అన్నక్యాంటీన్ లను వైసిపి ప్రభుత్వం వెంటనే ప్రారంభించి పేదప్రజల ఆకలి తీర్చాలని డిమాండ్ చేస్తూ రైల్వేకోడూరులో పేద ప్రజలకు మద్దతుగా ఒక్కరోజు నిరసన దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైల్వేకోడూరు టిడిపి ఇంచార్జ్ విశ్వనాథ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, మధ్యాహ్నం రైల్వేకోడూరు టిడిపి కార్యాలయం దగ్గర పేద ప్రజలకు అన్న క్యాంటీన్ ద్వారా అన్నదానం నిర్వహించబడునని కేకే చౌదరి తెలిపారు.