స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళి స్నేహితుడు ఇంటికే కన్నం వేసిన సంఘటన కడప నగరంలో చోటు చేసుకున్నది. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవుని కడపలో ఈ నెల 6వ తేది జరిగిన దొంగతనం కేసును చిన్నచౌక్ పోలీసులు చేధించారు. ఈ నేరంలో ఇద్దరు దొంగలు అరెస్ట్ అయ్యారు. వీరిలో ఒక బాల నేరస్తుడు ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 7 లక్షల 60 వేల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కడపడీఎస్పీ వెంకట శివారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. చిన్న చౌక్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సైలు రోషన్, అమర్ నాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.