ఏపీలో ఇక నుంచి ప్రతి మండలానికి ఇద్దరు MEO లను నియమించాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి పాఠశాలల నిర్వహణ అప్పగించాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని, వెల్ఫేర్-ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ప్రతివారం స్కూళ్లను సందర్శించాలన్నారు. నెలకోసారి ANMలు స్కూళ్లను పరిశీలించి, తమ దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.