ఏపీ రాజధాని అసైన్డ్ భూముల స్కాంలో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, విజయసారధి, బడే అంజనేయులు, కొట్టి దొరబాబులను అరెస్టు చేసింది సీఐడీ. 1100 ఎకరాల అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 169.27 ఎకరాలకు సంబంధించి ఈ ఐదుగురిని అరెస్టు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై ఆరోపనలుండగా, ఆయన బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. వేర్వేరు సర్వే నంబర్లతో 89.8 ఎకరాల భూమిని అక్రమంగా నారాయణ కొనుగోలు చేసినట్లు ఆరోపనలున్నాయి. రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపినట్లు నిర్ధారించింది సీఐడీ. నారాయణ, రామకృష్ణ హౌసింగ్ ప్రై.లి మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చింది.