ఏపీ సీఎం జగన్ మంగళవారం వైద్యం, ఆరోగ్య విభాగాల పనితీరుపై సమీక్ష జరిపారు. ప్రతి మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని, క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. అనంతపురం, విజయవాడ, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లైనాక్ మెషీన్లను ఏర్పాటు చేయాలన్నారు. మిగిలిన చోట్ల దశలవారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు లైనాక్ బంకర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.