కేంద్ర ప్రభుత్వం జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ కొత్త లిస్ట్ లో మొత్తం 384 ఔషధాలున్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్‌లతో పాటు 34 ఔషధాలను కొత్తగా చేర్చారు. రనిటైడిన్ సహా 26 ఔషధాలను ఈ జాబితా నుంచి తొలగించారు. ప్రముఖ యాంటాసిడ్ అయిన రనిటైడిన్ ను తొలగించడంతో ఇకపై జిన్‌టాక్, రాంటాక్ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల జాబితాలో కనిపించవు.