బెంగాల్ కు చెందిన అయూబ్ కు ఝార్ఖండ్ కు చెందిన ఫాతిమాకు 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయూబ్ ఇప్పుడు ఆస్తి కోసం రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికి ఒప్పుకోలేదని ఫోన్ లోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా సీనియర్ ఎస్పీని ఆశ్రయించింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.