మూడు రాజధానుల ప్రకటన పై శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆనాడు అమరావతికి జైకొట్టిన జగన్.. ఇప్పుడు 3 రాజధానుల మాటెత్తడం ఎందుకో స్పష్టం చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని, జగన్ ప్రభుత్వం చేతగానితనాన్ని విడనాడాలని హితవు పలికారు. 3 రాజధానుల ప్రకటన కేవలం ప్రజల మధ్య విద్వేషాల కోసమే అని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్ కే మంచిదని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.