గోదావరి నదికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది.ఈ సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.60 అడుగులుగా ఉంది. 13,49,565 క్యూసెక్కుల నీరు దిగువకు వెళోంది. అటు ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.79 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రభావిత జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. కంట్రోల్ రూం నెంబర్లు: 1070, 1800 425 0101, 08632377118.