పామును చూస్తే సాధారణ ప్రజలు హడలిపోతారు. అయితే స్నేక్ క్యాచర్స్ మాత్రం చాలా సులువుగా వాటిని పట్టుకుంటారు. ఈ క్రమంలో కొన్ని సార్లు వారికి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. రాజస్థాన్ చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ(45)కి పాములు పట్టుకోవడంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అయితే శనివారం పామును పట్టుకునే క్రమంలో ఆ విషనాగు కాటేసింది. దీనిని ఆయన తేలికగా తీసుకున్నాడు. కాసేపటికే కుప్పకూలి ప్రాణం విడిచాడు. కాటేసిన పాము అత్యంత విషపూరితమైనది కావడంతో అతడు త్వరగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa