అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. ఆమెను పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును కోట్లాది రూపాయల మేర మోసగించినట్టు కొత్తపల్లి గీతపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ గతంలో కొత్తపల్లి గీతను, ఆమె భర్త రామకోటేశ్వరరావును విచారించింది. కొత్తపల్లి గీత పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.42.79 కోట్ల మేర మోసగించినట్టు అభియోగాలు మోపారు. ఈ కేసులో భాగంగా నేడు హైదరాబాదులో కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అరెస్ట్ నేపథ్యంలో, కొత్తపల్లి గీత బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa