తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బాబా ఆలయం వీధికి చెందిన పునీత్(22) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువకుడు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సందర్భంగా రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa