కుప్పం పట్టణంలో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని మంగళవారం రిమాండుకు తరలించినట్లు ఎస్సై శివకుమార్ పేర్కొన్నారు. పట్టణానికి చెందిన భరత్ అనే యువకుడు ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కుప్పం జూనియర్ సివిల్ కోర్టులో యువకిడిని హజరుపరచగా, న్యాయమూర్తి యువకుడికి 14 రోజుల రిమాండ్ విధించారని ఆయన తెలియచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa