తిరుపతి ఘాట్ రోడ్డులో పెద్ద ప్రమాదం ...తప్పింది కానీ పరిస్థితులు చెప్పలేనివగా ఉన్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండో మలుపు దగ్గర బుధవారం ఆగి ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితులు విజయవాడ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘాట్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa