దివంగత బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారతదేశం తరపున ద్రౌపది ముర్ము బ్రిటన్ రాణికి నివాళులర్పిస్తారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 19 వరకు లండన్లో పర్యటించే అవకాశం ఉంది.