బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయాను కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) అమలుకు సంబంధించి రెండు కీలక అంశాలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో సీజీహెచ్ఎస్ పర్యవేక్షణకు అదనపు డైరెక్టర్‌ను నియమించాలని, విశాఖపట్నంలో సీజీహెచ్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.