తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.శాసనసభ సమావేశాల్లో మొత్తం 15 అంశాలను లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర సందర్భంగా అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ తాజాగా అరెస్ట్‌లకు దిగిన విషయాన్ని హైలెట్ చేయాలని నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa