శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.ఇద్దరు ఉగ్రవాదులను పుల్వామాకు చెందిన ఐజాజ్ రసూల్ నాజర్, షాహిద్ అహ్మద్‌గా గుర్తించారు."వీరు ఇటీవల పుల్వామాలో 2/9/22న పశ్చిమ బెంగాల్‌కు చెందిన మునీర్ ఉల్ ఇస్లాం అనే బయటి కూలీపై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నారు" అని తెలిపారు.