ఏపీలో గురువారం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలను చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఏ అంశం పైన అయినా చర్చకు రెడీ అని సీఎం జగన్ చెప్పారు. రాజధానిపై కూడా చర్చ పెడదాం అన్నారు.