గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. భోజనంలో ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నట్స్, ప్రొటీన్ ఎక్కువగా దొరికే పదార్థాలు, చేపలు వంటివి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. కూల్ డ్రింక్స్ తాగడం మానుకోవాలి. రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.