దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని సీఎం వైయస్ జగన్ విజయవాడ నడిబొడ్డును ఏర్పాటు చేస్తున్నారు అని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అయన మాట్లాడుతూ... ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టారు. సభా మర్యాదలు పాటించకుండా బాధ్యతారాహిత్యంగా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలను ఏ విధంగా పైకితీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారు. అభూత కల్పనలతో సభను, సభ్యులను అగౌరవపర్చాలనే ఆలోచనతో ప్రతిపక్షం ప్రవర్తించవద్దు అని హెచ్చరించారు.