వికేంద్రీకరణను ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారని, ఒక్క చంద్రబాబు ఒక్కరే దీన్ని వ్యతిరేకిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సీఎం వైయస్ జగన్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నారని వివరించారు. అసెంబ్లీలో వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు.గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారు.
ప్రజలకు చేరువ చేయాలన్న ఆశలకు అనుగుణంగా వైయస్ జగన్ తన పాలనను ప్రజలకు చేరువుగా, అనుకూలమైన విధానాలను తీసుకువచ్చారు. 2019 అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి 2 వేల జనాభాకు 12 మంది సచివాలయ ఉద్యోగులను నియమించారు. ఆ కారణంగా ఈ రోజున రాష్ట్రంలోని ప్రజలందరికీ తమ సమస్యలను చెప్పుకోవడానికి సులువైన మార్గం దొరికింది. దేశంలోనే సచివాలయ వ్యవస్థను ఇంత దగ్గరగా తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్‌ది అని ఆయన తెలిపారు.