సైబర్ నేరగాళ్లు కేవైసీ పేరుతో కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ హెచ్చరించారు. ‘మీ కేవైసీ అప్‌డేట్ చేస్తున్నాం’ అని ఫోన్లు వస్తే అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరస్తులు మాయలో ఎవరో పడవద్దు అని తెలిపారు. ఒకవేళ మోసపోయీ డబ్బులు పోగొట్టుకుంటే, హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలన్నారు. మోసం చేస్తున్నట్టు అనుమానం వచ్చిన ఫిర్యాదు చేయాలన్నారు.