ఈ నెల 22వ తేదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించనున్న నేపద్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి కుప్పం పర్యటనకు వస్తున్నందున ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లను ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి ఎమ్మెల్సీ భరత్ నాలుగు మండలాల వైసిపి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తున్నారు. బహిరంగ సభాస్థలి వద్ద ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతోంది.