అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం కాదని, పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'బినామీ భూముల ప్రాంతమే రాజధానిగా ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు కూడా తమ వాళ్లే అమ్మాలన్నది వారి తీరు. కార్పొరేట్ చదువుల్లోనూ నారాయణ, చైతన్యనే ఉండాలనుకుంటారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీల్లోనూ తన మనుషులే ఉండాలన్నది చంద్రబాబు తీరు' అని మండిపడ్డారు.