దక్షిణకాశీగా, ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 26 వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతాయని, 5వ తేదీ దసరా సందర్భంగా ఉదయం 11 గంటలకు ఆయుధపూజ, సాయంత్రం పెద్దసేవపై స్వామివార్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa