రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కృష్ణాజిల్లా వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ అన్నారు. గుడివాడ పట్టణంలోని 12వ వార్డులో మైనార్టీ నాయకులతో కలిసి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల్లోని నిరుపేదలకు మేలు చేసే విధంగా సీఎం షాదీ తోఫా పథకాన్ని ప్రవేశపెట్టడం హర్ష ణీయమన్నారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు లబ్ది చేకూరుతుందన్నారు. సీఎం జగన్మోహన్రె డ్డికి మైనార్టీలు వెన్నుదన్నుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ కే బాజీ, నాయకులు రజాక్ బాషా, కరీముల్లా బేగ్, తాజుద్దీన్, సర్దార్ గ్, షన్ను పాల్గొన్నారు.