గొల్లపూడి నుంచి చినకాకాని వద్ద చెన్నై హైవేలో కలిసేలా కృష్ణానదిమీద రూ. 650 కోట్లతో 18 కిమీ విస్తీర్ణంతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. అలానే విజయవాడ తూర్పు వైపున చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని త్వరలో ప్రారంభించి ఆరు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తాం అని తెలియజేసారు.
చంద్రబాబు ఐదేళ్లలో పూర్తి చేయలేని కనకదుర్గ ఫ్లై ఓవర్ ను అధికారంలోకి వచ్చాక పూర్తి చేశాం. బెంజ్ సర్కిల్ వద్ద మొదటి ఫ్లై ఓవర్‌ను ఐదేళ్లు పాలించినా కూడా చంద్రబాబు పూర్తి చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొదటి ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా రెండో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. విజయవాడ అభివృద్ధి కోసం రూ. 100 కోట్ల స్పెషల్ గ్రాంట్ తో మున్సిపాలిటీ ని డెవలప్ చేస్తున్నాం.కృష్ణానదికి వరదలొచ్చినప్పుడల్లా కృష్ణ లంక ప్రాంత వాసులు మునిగిపోయేవారు.. వారిని కాపాడటానికి 1.5 కిమీల మేర రూ. 137 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశాం. మరో వైపున కిలోమీటర్ పొడవున మరో రిటర్నింగ్ నిర్మాణానికి పనులు మొదలు పెడుతున్నాం. చంద్రబాబు నివసించే కరకట్ట రోడ్డు విస్తరణకు రూ. 150 కోట్లతో పనులు మొదలు పెట్టాం. బందర్ రోడ్డు వద్ద రూ. 260 కోట్లతో అంబేడ్కర్ పార్కు నిర్మాణ పనులు చేపట్టాం అని సీఎం జగన్ తెలియజేసారు.