గురువారం సాయంత్రం పొన్నూరు మండలం మన్నవ గ్రామ తెలుగుదేశం పార్టీ, మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి బాబురావు ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ... పేదల పట్ల రాక్షసునిగా సంక్షేమం ముసుగులో అనేక వనరులు దోపిడీ చేస్తూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టలేక అన్ని వర్గాల ప్రజలను అధిక పన్నులతో నిత్యావసర వస్తువుల ధరలతో నిత్యం దోచుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి పాలనకు నిరసనగా "బాదుడే బాదుడు" కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేసారు.