14.09.2022 తేదిన విజయవాడ కానురుకు చెందిన ఒక యువకుడు కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కు వచ్చి, 13.09.2022 తేదిన రాత్రి సమయంలో వన్ టౌన్ నుండి తన ఇంటికి వెళ్ళడానికి మార్కెట్ వద్ద ఒక ఆటో, ఎక్కినట్లు, ఆ ఆటో లో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్లు వారందరు కలిసి కృష్ణ లంక పాత పైర్ స్టేషన్ సమీపం లోనికి వచ్చేసరికి ఆటోని ఆపి వారందరు కలిసి తనని బెదిరించి తన వద్ద వున్న డబ్బులు మరియు సెల్ ఫోన్ లాక్కొని పారిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణ లంక పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు.
అదే విధంగా ది.14.09.2022 తేదిన విజయవాడ చెందిన మరొక వ్యక్తి స్టేషన్ కు వచ్చి, 13.09.2022 తేదిన రాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చి బందర్ లాకులు సమీపంలో తన బండికి అడ్డంగా పెట్టి, తనను చేతులతో కొట్టి బెదిరించినట్లు ఈ సమయంలో చుట్టుపక్కల వారు రావడం గమనించి పారిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై కృష్ణ లంక పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు.
పై సంఘటనలను తీవ్రంగా పరిగణించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., వెంటనే నిందితులను పట్టుకుని అరెస్ట్ చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు తూర్పు జోన్ డి.సి.పి. శ్రీ విశాల్ గున్ని ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో సౌత్ డివిజన్ ఏ.సి.పి. డా.బి.రవికిరణ్ గారి ఆధ్వర్యంలో కృష్ణ లంక ఇనస్పెక్టర్ శ్రీ దుర్గారావు గారు, జైమ్ ఎస్.ఐ. శ్రీ కృష్ణ బాబు గారు మరియు వారి సిబ్బందితో కలిసి మూడు బృందాలుగా ఏర్పడి ఫిర్యాది ఇచ్చిన సమాచారంతో మరియు సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించుకుని అనుమానితులను గుర్తించి వారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపధ్యంలో కృష్ణ లంక ఇన స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు ది. 15.09.2022 తేదిన బస్ స్టాండ్ సమీపంలోని గంగోత్రి హోటల్ వద్ద అనుమానితులైన నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి చోరిసొత్తు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు:
1. 2. 3. 4.
విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనికి చెందిన పెద్ది వినయ్ @ ఉల్లిపాయ, 8/0 రాము, 22 సం.లు, విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనికి చెందిన వల్లేపు దానియేలు, 5/0 రామయ్య, 20 సం,లు, విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనికి చెందిన తురక కాశి నాని 5/0 మౌలాలి, 22 సం.లు విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనికి చెందిన డబ్బుకోటి రమేష్, 5/0 గంగయ్య, 20 సం,లు.