శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం.. సీఎం జగన్‌ను శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి కోరారు.