ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నాటి సమావేశాల్లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, ఆర్ధికాభివృద్ధి అనే అంశంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశ పెట్టనుంది . ఇండియన్ స్టాంప్స్ సవరణ బిల్లు, యూనివర్సిటీ ల చట్ట సవరణ బిల్లు,ఆర్.జి.యూ.కె.టి సవరణ బిల్లు,పంచాయతీ రాజ్ సవరణ బిల్లు,రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు,సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు,అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సవరణ బిల్లు,ల్యాండ్ టైటిలింగ్ బిల్లులు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. శాసన మండలిలో బీఏసీ నివేదిక ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. ఆపై విద్యా సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.