జిల్లాలో ఇంకా గ్రౌండింగ్ కాని జగనన్న లే - అవుట్లలో మేరక వంటి సమస్యలపై లే - అవుట్ల వారీ సమగ్ర నివేదిక సమర్పించాలని కృష్ణా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల అధికారులను ఆదేశించారు . గురువారం జాయింట్ కలెక్టర్, కలెక్టరేట్ నుండి మండల అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి జగనన్న లే - అవుట్లలో గృహాల గ్రౌండింగ్ , మెరక , మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి అంశాలపై సమీక్షించారు.
ప్రతి మండలంలో ప్రతి లే - అవుట్లలో డి . ఈ . లు , ఏ . ఈ . లు మరియు ఎం . పి . డి . ఓ . లు విజిట్ చేసి గృహ నిర్మాణాలు ఇంక ఎందుకు ప్రారంభం కాలేదో సమస్యలను గుర్తించి లే - అవుట్ల వారీగా నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు . ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో పంచాయతీ రాజ్ ఎస్ . ఈ . ఈరాస్వామి తదితరులు పాల్గొన్నారు.