ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గొట్టం మిల్లు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.