చట్టసభలకు దూరంగా ఉన్నటీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ఆయన బాధ్యతారాహిత్యానికి అద్దంపడుతున్నాయి అని వైసీపీ నాయకులూ విజయ్ సాయి రెడ్డి ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాసమస్యలపై వీరోచితంగా పోరాడుతున్న పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ‘వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ధైర్యం ఉందా?’ అని ఆయన ప్రశ్నించడం ఆయన అయోమయ మానసిక స్థితికి నిదర్శనం.
పాలకపక్షం పార్టీ టికెట్లతో అసలు విపక్ష నేతకు ఏం పని? ఎన్నికలు ఇంకా 20 నెలలుండగా, ఏపీ చట్టసభల్లో కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో చంద్రబాబు గారు ఇలాంటి మాటలు ఎందుకు చెబుతున్నారు? తాను సభకు హాజరురాను కాబట్టి ‘మీరంతా గట్టిగా కొట్లాడాలి. అప్పుడే మీకందరికీ పార్టీ టికెట్లు ఇస్తాను,’ అనే సందేశం ఇస్తున్నాయి టీడీపీ అధినేత మాటలు. కేబినెట్ హోదా అనుభవించడానికి అవకాశం ఇస్తున్న ప్రతిపక్ష నేతగానైనా చంద్రబాబు గారు మిగిలిన నాలుగు రోజులైనా ఏపీ శాసనసభకు హాజరైతే బాధ్యతగల మాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు అని హితవు పలికారు.